telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

శ్రద్ధ .. సాహో అనేసిందా…

sraddha on saaho movie and

ప్రభాస్ సరసన సాహో సినిమాలో హీరోయిన్ గా నటించి తొలిసారి సౌత్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. భారీ బడ్జెట్ తో విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమా, పెద్దగా సక్సెస్ కాకపోవడం ఒకరకంగా ఆమె సహా, ఆ సినిమా యూనిట్ మొత్తానికి నిరాశను కలిగించే అంశం అని చెప్పాలి. అయితే ఈ సినిమా విషయమై శ్రద్ధ కపూర్ మాత్రం కొంత విచిత్రంగా మాట్లాడడం అందరికి షాకింగ్ గా అనిపిస్తోంది. సాహోతో పాటు ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిచ్చోరె అనే సినిమా కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుండడంతో, నిన్న ముంబైలో మీడియాతో ముచ్చటించారు శ్రద్ధ. తనకు కెరీర్ పరంగా ఇప్పటివరకు ఎన్నో హిట్స్ దక్కాయని, అయితే వాటన్నిటిలోకి ప్రభాస్ తో నటించిన సాహో నే ది బెస్ట్ అని అంటోంది ఆమె.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేవలం హిందీ వర్షన్ లోనే సాహో సినిమా రూ.150 కోట్ల పైచిలుకు కలెక్షన్ సాధించిందని, ఇది ఇప్పటివరకు తాను నటించిన అన్ని సినిమాల్లోకి హైయెస్ట్ అని ఆమె అంటోంది. సాహో కోసం యూనిట్ లోని ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పని చేసారని, అయితే చివరకు ప్రజలు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చినందకు తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. నటుడిగా ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని, ఆయనతో కలిసి భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నట్లు శ్రద్ధ తెలిపారు. అయితే శ్రద్ధ చేసిన ఈ కామెంట్స్ పై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్లు. కొందరేమో ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం, సాహో ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ విషయాన్ని శ్రద్ధ మర్చిపోయారా అంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు……!!

Related posts