telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ వృద్దులకు .. శుభవార్త.. !

sports event to old aged in hyderabad

హెల్తీ సీనియర్ సిటిజన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆరోగ్యవంతులైన వయోవృద్ధులను క్రీడల ద్వారా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశామని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అంతర్జాతీయ వెటరన్ క్రీడాకారుడు ఆర్‌పీ.భగవాన్, ప్రధాన కార్యదర్శి ఎంఅర్‌పీ బాబు తెలిపారు.

పద్మారావునగర్‌కు చెందిన భగవాన్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఎ మైదానంలో తమ అసోసియేషన్‌ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్, ఎండీ దినకర్ బాబు, ప్రత్యేక అతిథిగా నిజాం కళాశాల ప్రిన్సిపాల్, ఓయూ స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్‌బీ. లక్ష్మీకాంత్ రాథోడ్‌లు హాజరవుతారని తెలిపారు.

ఆదివారం ఉదయం 7 గంటలకు క్రీడలు మొదలవుతాయని, అందులో రన్నింగ్, వాకింగ్, జంపింగ్, త్రో క్రీడా పోటీలు ఉంటాయన్నారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 92473 93114, 92907 44738లలో సంప్రదించాలని వారు కోరారు.

Related posts