telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్‌కు ప్రత్యేక రైళ్లు

Attack Railway TTI in Danapur express

వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్‌కు దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లు నడిపిస్తుంది. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రతీ బుధ, శనివారాల్లో జూన్ 29వ తేదీ వరకు నెల రోజులపాటు ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ రైళ్లు బుధ, శని వారాల్లో మధ్యాహ్నం 12.30గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30గంటలకు భువనేశ్వర్‌కు చేరుకుంటుంది.

అదేవిధంగా భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ గురు, ఆదివారాల్లో మే 30వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వారానికి రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు.

Related posts