telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ నుండే, సంక్రాంతికి 13 ప్రత్యేక రైళ్లు… ద.మ.రైల్వే

Attack Railway TTI in Danapur express

రోజు కోట్లమందికి తమతమ గమ్యస్థానాలకు చేరవేసే భారతీయరైల్వే శాఖ, పండగలు వస్తున్నాయంటే ప్రత్యేక రైళ్లను ఆయా రూట్లలో ఏర్పాటు చేస్తుంది. ఉన్న రైళ్లలో తీవ్రమైన డిమాండ్ ఉండటంతో, ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా, సంక్రాంతి పర్వదినం కోసం సొంతూళ్లకు వెళ్లాలని భావించే హైదరాబాద్ వాసులకు శుభవార్త. పండగ రద్దీ అధికంగా ఉండటం, రెగ్యులర్ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లలోనూ బెర్తులు నిండుకోవడంతో మరో 13 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటిల్లో ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తామని పేర్కొంది. ఈ రైళ్లలో రెండు తప్ప మిగిలినవి ఆంధ్రప్రదేశ్‌ లోని వివిధ ప్రాంతాలకు నడుపుతామని తెలిపింది.

కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ కు 16, 17, 20 తేదీల్లో రెండేసి. 18న ఒకటి, నర్సాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య 18, 19, 20 తేదీల్లో ఒక్కోటి, విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ కు 17న, సికింద్రాబాద్‌ నుంచి కాకినాడకు 13, 20 తేదీల్లో ఒక్కో రైలును నడిపిస్తామని, ఇవన్నీ సువిధ సర్వీసులేనని రైల్వే శాఖ పేర్కొంది.

Related posts