telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

445 ప్రత్యేక రైళ్లు… వేసవి సెలవులకు ఇళ్లకు వెళ్లేవారి కోసమట..

Attack Railway TTI in Danapur express

విద్యాసంవత్సరం ముగుస్తుండటంతో.. వివిధ ప్రదేశాల నుండి పట్టణాలకు చదువు కోసం వచ్చిన విద్యార్థులు ఇళ్లబాట పట్టనున్నారు. దీనితో ఎప్పటి లాగానే ప్రయాణికుల కోసం రైల్వే, రద్దీని గుర్తుపెట్టుకొని, వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఈ ఏడాది వేసవి ప్రయాణికుల సౌకర్యార్థం ఏకంగా 445 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఈ రైళ్ల సేవలను ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేసింది.

మార్చి 1 – జూన్ 28 మధ్య: సికింద్రాబాద్‌-కమాఖ్య-సికింద్రాబాద్‌ (రైలు నెం. 07149/07150). ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌, జల్పాయ్‌గురి మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 1 – జూన్ 30 మధ్య: హైదరాబాద్‌-జైపూర్-హైదరాబాద్‌ (రైలు నెం. 02731/02732). నిజామాబాద్‌, నాందేడ్‌, అజ్మీర్ మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి3-జూలై 3 మధ్య: సికింద్రాబాద్‌-బరౌని-సికింద్రాబాద్‌ (రైలు నెం. 07009/07010). కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పూర్‌, రాంచీ, గయ మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 5-జూన్ 28 మధ్య: సికింద్రాబాద్‌-రక్సౌల్ -సికింద్రాబాద్‌ (రైలు నెం. 07091/07092). కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పూర్, పాట్నా మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 2-జూలై 2 మధ్య: సికింద్రాబాద్‌- దర్భాంగ- సికింద్రాబాద్‌ (రైలు నెం. 07007/07008). కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పూర్, పాట్నా మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 7-జూన్ 30 మధ్య: హైదరాబాద్‌-రక్సౌల్-హైదరాబాద్‌ (రైలు నెం 07005/07006): కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పుర్‌, గయ, దర్భాంగ మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 7-జూన్ 29 మధ్య: హెచ్‌ఎస్‌ నాందేడ్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ (రైలు నెం. 02485/02486).

జూన్ 7 నుంచి 29 మధ్య: కాచిగూడ-కాకినాడ పోర్ట్‌-కాచిగూడ (రైలు నెం.07425/07426). నల్గొండ, గుంటూరు, విజయవాడ, సామర్లకోట మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 3-జూలై 1 మధ్య: కాచిగూడ-కృష్ణరాజపురం-కాచిగూడ (రైలు నెం. 07603/07604): మహబూబ్‌నగర్‌, కర్నూలు, హిందూపురం, యలహంక మీదుగా ప్రయాణిస్తుంది.

Related posts