telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్-శ్రీకాకుళం మధ్య … ప్రత్యేక రైలు…

special train between vijayawada to gudur

హైదరాబాద్-శ్రీకాకుళం మధ్య 17, 19 తేదీల్లో ప్రత్యేక రైలు (07026)ను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రైలు నడవనున్న ఈ రెండు రోజుల్లోనూ సాయంత్రం ఏడున్నర గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:53 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 1:10 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం నుంచి 18, 20 తేదీల్లో రైలు (07025) మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకే ఈ రైలును నడుపుతున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related posts