telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తిని రేకెత్తిస్తున్న “స్పెషల్” ట్రైలర్

Special

నటుడు అజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గతంలో అజయ్ ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా కూడా చేశాడు. ఇప్పుడు మరో సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాత్సవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “స్పెషల్” సినిమాలో అజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. “93 డేస్ సస్పెన్షన్ తరువాత తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాను. గత 7 రోజుల్లో నేను చూసిన విషయాలు ఏ పోలీస్ ఆఫీసర్ తన కెరియర్లో చూసి ఉండడు” అంటూ అజయ్ చెప్పిన డైలాగ్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఒక కేసు విచారణకి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హీరోగా అజయ్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Related posts