telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేవి శ్రీ ప్ర‌సాద్ .. పుట్టినరోజు కనుక..

special song on devisriprasad birthday

దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెళ్ళిళ్ళ‌ల్లోను, ప‌లు ఈవెంట్స్‌లోను దేవి శ్రీ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీల‌కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆయ‌న పాట‌ల‌కి స్టెప్పులేస్తూ సంతోషంగా గడుపుతుంటారు. అంతర్జాతీయంగా కూడా ఆయ‌న సంగీతానికి మంచి డిమాండ్ ఉంది. రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్‌లోని వాడెవ‌డన్నా వీడ‌వెడ‌న్నా అనే సాంగ్‌కి అంత‌ర్జాతీయ వేదిక‌పై ‘ది కింగ్స్‌’ అనే భార‌త డ్యాన్స్ గ్రూప్ స్టెప్పులు వేసి అల‌రించింది. ఈ పాట‌కి దేవి శ్రీ ప్ర‌సాదే బాణీలు స‌మ‌కూర్చారు. దాదాపు స్టార్‌ హీరోల ల్యాండ్ మార్క్ చిత్రాలకి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఉండ‌డం విశేషం.

జూనియర్ ఎన్టీఆర్ 25వ చిత్రం నాన్నకు ప్రేమ‌తో, సూర్య 25వ చిత్రం సింగంకి కూడా దేవి శ్రీనే సంగీత ద‌ర్శ‌కుడిగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150కి దేవి శ్రీ అద్భ‌త‌మైన స్వ‌రాలు అందించారు. తాజాగా మ‌హేష్ బాబు 25వ చిత్రం మ‌హ‌ర్షికి కూడా దేవి శ్రీ ప్రసాదే సంగీత ద‌ర్శ‌కుడు. ఇలా ల్యాండ్ మార్క్ చిత్రాల‌న్నింటికి దేవి శ్రీ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఆయన ప్ర‌తిభ‌కి అర్దం ప‌డుతుంది. ఈ రోజు ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ఆదిత్య మ్యూజిక్ సంస్థ స్పెష‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల చేసింది. శ్రీకాంత్ కొప్పుల సాంగ్ కంపోజ్ చేయ‌గా పూర్ణ చారి లిరిక్స్ అందించారు. హైమ‌త్‌, స‌త్య యామిని ఆలపించారు. మీరు ఆ పాట‌ని చూసి ఎంజాయ్ చేయండి.

Related posts