telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఈ షాంపూతో చుండ్రుకు చెక్ పెట్టొచ్చు

Hair-care

మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీ లైఫ్‌స్టైల్ బాలేదని అర్ధం. చాలామంది మహిళలు చుండ్రుతో బాధపడుతున్నారు. చుండ్రు చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది. దీనివల్ల స్కాల్ప్ బాగా ఆయిలీగా అయినా మారుతుంది. డ్రైగా అయినా మారిపోతుంది. దీని వల్ల యాక్నే, రాషెస్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అయితే జుట్టుకి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్‌కి చాలా సార్లు దువ్వెన మార్చడంతో చెక్ పెట్టచ్చు. జెల్స్, లోషన్స్ వాడకాన్ని తగ్గించండి. దీనివల్ల ఇన్ ఫెక్షన్స్, చుండ్రు వస్తాయి. కాబట్టి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. రెగ్యులర్ గా షాంపూ వాడడం తప్పనిసరి. ఉద్యోగాలు చేసే స్త్రీలు చుండ్రు సమస్యతో ఎక్కువ బాధపడతారు. రోజూ వాడేందుకు సోయా ప్రొటీన్, ఆల్మండ్ ఆయిల్ ఉన్న జెంటిల్ షాంపూ ఎంచుకోండి. సోయా ప్రొటీన్ జుట్టుకి పోషణనిస్తే, ఆల్మండ్ ఆయిల్ డాండ్రఫ్ ని తగ్గించడానికి సహకరిస్తుంది. రోజ్ మేరీ ని సీరియస్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్‌కి మాంచి మెడిసిన్ అని చెప్పొచ్చు.

రోజ్మేరీ ఆయిల్ ఉన్న షాంపూతో హెయిర్ వాష్ చెయ్యండి. మార్కెట్ లో రోజ్మేరీ ఆయిల్ ఉన్న షాంపూస్ చాలా ఉన్నాయి. రోజ్మేరీ ఆయిల్ తో పాటూ మెంథాల్ కూడా ఉన్న షాంపూ డాండ్రఫ్ ఉన్న హెయిర్ కి చాలా మంచిది. షాంపూ తరవాత కండిషనర్ ని తప్పనిసరిగా అప్లై చెయ్యండి. ఇందులో రోజ్మేరీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటే ఇంకా మంచిది. షాంపూ, కండిషనర్ ఒకే బ్రాండ్ వి దొరికితే అవే తీసుకోండి. దీనివల్ల రిజల్ట్స్ బావుంటాయి. మీరూ బేస్ గా వాడే ఆయిల్ లో కొంచెం రోజ్మేరీ ఆయిల్ కలిపి జుట్టంతా నెమ్మదిగా మసాజ్ చెయ్యండి. ఒక టవల్ ని వేడి నీళ్ళలో ముంచి, గట్టిగా పిండి దాన్ని తలకి చుట్టుకోండి. కొన్ని నిమిషాల తరవాత షాంపూ చేస్కోండి. వీటితో పాటూ, పోషకాహారం తీసుకోవాలి. ఎక్కువగా జుట్టు జిడ్డు కాకుండా, తడిగా లేకుండా చూసుకుంటుండాలి. అదే విధంగా, జుట్టుపై ప్రయోగాలు చేయకూడదు. కలరింగ్, హెయిర్ స్ప్రేలు, స్ట్రెయిటనింగ్ ఇలాంటివి చేయకూడదు. దీని వల్ల జుట్టు సమస్యలు వస్తాయి. కాబట్టి అవి చేయకపోవడమే మంచిది.

Related posts