telugu navyamedia
culture news

గంగానమ్మ గుడిలో వింత.. గోడలో నుంచి  నీరు.వచ్చి వెళ్లిపోతోంది

Special Attraction on Ganganamma Temple
ఏలూరు : పడమరవీధి ప్రజల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పాత గంగానమ్మ గుడిలో మంగళవారం రాత్రి వింత చోటు చేసుకున్నది. సుమారు 200 ఏళ్ళ క్రితం నిర్మించిన ఆలయంలో గంగానమ్మ తల్లి మూల విరాట్‌ వెనుక గోడ నుంచి నీరు ఉబికి వస్తుండడంతో ఈ వింతను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా ఆలయానికి తరలివస్తున్నారు. ఆ నీటిని తీర్థంగా స్వీకరిస్తున్నారు. ఐదు నుంచి ఏడు నిమిషాలు మాత్రమే నీరు అలా వచ్చి అమ్మవారి పాదాలను తాకుతూ వెనక్కి వెళ్ళిపోవడంతో ఇది అమ్మవారి మహత్య మంటూ భక్తులు తన్మయత్వంచెందుతు న్నారు. నీరు వెనక్కి వెళ్ళిపోయిన వెంటనే నీరు వచ్చిన ఆనవాళ్ళు ఉండడంలేదు. నవంబర్‌ 9 నుంచి పడమరవీధిలో గంగానమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఇలా అమ్మవారికి ముడుపు కట్టిన దగ్గర నుంచి వారంలో రెండుసార్లు ఇలా జరుగుతుందని భక్తులు తెలిపారు. నీరు ఎటు నుంచి వస్తుందో, ఎలా వస్తుందో అంతుపట్ట డంలేదు. ఆలయం నిర్మించిన దగ్గర నుంచి ఏనాడూ ఇలా జరగలేదని స్థానికులు చెబుతున్నారు.
పాత గంగానమ్మ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇప్పుడు ఉన్న ఆలయం పూర్వం పంట కాల్వ రేవుగా ఉండేదని, పంట కాల్వలో గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ, వినుకొండ అంకమ్మ, ఆదిమహాలక్ష్మమ్మ, పోతు రాజుబాబు విగ్రహాలు నీళ్ళల్లో కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఆగాయన్నారు. ఆనాడే అప్పటి ప్రజలు అమ్మవార్లను, పోతురాజుబాబును ప్రతిష్టించి పూజలు చేస్తూ ఆలయాన్ని నిర్మించా రన్నారు. ఆనాటి నుంచి ఆలయం చెక్కు చెదరలేదన్నారు. ఇప్పుడు ఆలయంలో జాతర ప్రారంభమైన దగ్గర నుంచి ఈ వింత చోటు చేసుకోవడం శుభ సూచికమని ఆలయ కమిటీ అధ్యక్షుడు గోవాడ శ్రీనివాసరావు, సెక్రటరి చిదరబోయిన శ్రీనివాసరావు తెలిపారు.

Related posts

తెరాస తరపున ఉపాసన పోటీ… క్లారిటీ వచ్చేసింది

vimala p

ప్రేమ కోసం…

vimala p

టీటీడీ లో .. మరో వివాదం.. స్వామి ఆదాయ లెక్కలు చూసే 40 మందికి ఉద్వాసన..

vimala p