telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్పీకర్‌ ఆటలో రిఫరీ లాంటి వాడు: యనమల

Yanamala tdp

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకష్ణుడు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కుటుంబంపై తమ్మినేని సీతారాం చేసిన విమర్శలను యనమల తప్పుపట్టారు. స్పీకర్‌ స్థాయిని దిగజార్చేలా ఆయన వ్యవహారశైలి ఉండకూడదని మండలిలో హితవు పలికారు. తన హోదా, బాధ్యత మర్చిపోయి మాట్లాడడం సరికాదన్నారు.

సభా నాయకుడికి ఏ స్థాయి గౌరవం ఉంటుందో, ప్రతిపక్ష నాయకుడికి అదే స్థాయి గౌరవం ఉంటుందని స్పీకర్‌కు తెలియదని అనుకోవాలా? అని ప్రశ్నించారు. స్పీకర్‌ ఆటలో రిఫరీ లాంటి వాడని, ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరించడం తగదన్నారు. అందువల్ల రాజకీయ విమర్శలకు తావిచ్చేలా సభాపతి వ్యవహరించడం తగదన్నారు.

Related posts