telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లకూ .. ఎస్పీ ర్యాంకు అధికారులతో భద్రత…

defence minister respecting pulwama affected

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకమీదట సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ల భద్రతను ఎస్పీ ర్యాంకు అధికారులు పర్యవేక్షించనున్నారు. జవాన్ల తరలింపు ప్రక్రియ యావత్తు ఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.అంతేకాకుండా, కాన్వాయ్ ల వెంట భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సైని వాహనాల సంఖ్యను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

మరింత మెరుగైన రక్షణ కల్పించేందుకు వీలుగా ఒక్కో కాన్వాయ్ లో 40కి మించి వాహనాలు అనుమతించరాదని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రం సరికొత్త ప్రామాణిక కార్యాచరణ విధానం (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోగ్రామ్-ఎస్ఓపీ) రూపొందించింది.

Related posts