telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

బాలు మరణం సంగీతప్రియులకు తీరని లోటు: దత్తాత్రేయ

Dathatreya governor

ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం మరణం ప్రజలకు, సంగీతప్రియులకు తీరని లోటని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బాలు తనకు అత్యంత సన్నిహితుడని తన మరణం తీవ్రంగా కలచివేసిందని దత్తాత్రేయ తెలిపారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలిపారు.బాలు ఒక గొప్ప సంగీతకారుడు, ప్లేబ్యాక్ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని దత్తాత్రేయ పేర్కొన్నారు.

చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారని, పదాల మాదుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. తన 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 11 బాషలలో 40 వేల పాటలు పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడని తెలిపారు. 

Related posts