telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డోలీ మోసిన కూలీల కాళ్లకు దండం పెట్టిన ఎస్పీ బాలు… వీడియో వైరల్

SPB

సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం యావత్ దేశాన్నే కలచివేసింది. ఆయన కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న ఆయన అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గురువారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయన మరణంతో అభిమానులంతా విషాదంలో మునిగినిపోయారు. బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. బాలుతో తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు. తాజాగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఎస్పీ బాలు శబరిమలకు వెళ్ళినప్పుడు తనను డోలీలో మోసిన కూలీల కాళ్లకు దండం పెట్టారు. ఇక ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు.

Related posts