telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి

SPB

దిగ్గజ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అశ్రు నివాళులతో నేడు ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అయన అంతిమ సంస్కారాలు జరిగాయి. దీనికంటే ముందు బాలు కుటుంబ సభ్యులు వైదిక శైవ సంప్రదాయం ప్రకారం అంతిమ క్రతువు నిర్వహించారు. ఇక ఏపీ ప్రభుత్వం నుంచి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ బాలు అంతిమ సంస్కారాలకి హాజరయ్యారు.. తమ అభిమాన గాయకుడిని చివరిసారిగా చూసేందుకు అటు అభిమానులు పోటెత్తారు. కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో ఆగస్టు 4 న చెన్నైలోని MGM ఆసుపత్రిలో చేరారు.. అక్కడ అయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ అయన ఆరోగ్య స్థితిలో మార్పు రాలేదు.. ఈ క్రమంలో అయన శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఇక 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 17 భాషల్లో 40వేలకు పైగా పాడి భారత సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు ఎస్పీ బాలు. అత్యధిక పాటలు పాడిన ఏకైక గాయకుడిగా రికార్డుకు కూడా ఎక్కారు. ఆయన మరణం భారతీయ సినిమాకే తీరని లోటని చెప్పాలి.

Related posts