telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

దక్షిణ కాలిఫోర్నియాలో భూకంపం… ఈ న్యూస్ రీడర్ ఏం చేసిందంటే… !

Earthquake

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో వరుసగా రెండో రోజూ భూకంపం సంభవించింది. అయితే భూకంపం సమయంలో ఓ న్యూస్ ఛానెల్ లో పని చేస్తున్న న్యూస్ ప్రెజెంటర్ భూకంపానికి భయపడి బల్ల కింద దాక్కున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం నాడు మొదటిసారి 6.7 తీవ్రత కలిగిన భూకంపం ప్రజల్ని భయపెట్టగా, శుక్రవారం అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 6.9గా నమోదైంది. లాస్ ఏంజిలిస్‌కు 240 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. లాస్ ఎంజిలిస్ లోని అనేక హోటళ్లలో షాండిలియర్లు ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రజలందరూ భయంతో రోడ్ల మీదకొచ్చేశారు. కేంద్రానికి దగ్గర్లో ఉన్న రిడ్జ్ క్రెస్ట అనే టౌన్‌లో భూకంపం తీవ్రతకు కొన్ని చోట్ల రోడ్డు బీటలు పారాయి.అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఈ స్థాయి భూకంపం మరో సారి వచ్చే అవకాశం తక్కువని నిపుణులు తెలిపారు. ఆస్తి నష్టం ఎంతనేది తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Related posts