telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

టాప్ 2 లో సూర్య సినిమా…

Akashame-ni-Haddura

ఈ ఏడాది ముగింపు కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు… ఎందుకో అందరికి తెలుసు. అయితే ఈ ఏడాదిలో దక్షిణ భారతీయులు చాలా మంది గూగుల్ సెర్చ్‌లో ట్రెండ్ అయ్యారు. ప్రతి ఏడాది గూగుల్ తన సెర్చ్ ఇంజన్‌లో ఎక్కువగా శోధించబడిన వాటి జాబితాను విడుదల చేస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే దివంగత సుశాంత సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా దిల్ బేచారా ప్రథమ స్థానంలో ఉంది. సుశాంత్ సింగ్ మరణం ముందుగా చేసిన సినిమా కావడంతో సుశాంత్ చివరి సినిమాగా ఎందరో శోధించారు. దాంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక తరువాత స్థానానిక వస్తే దక్షిణ భారతదేశ రాష్ట్రోల్లో ఒకటైన తమిళ సినిమా ఉంది. హీరో సూర్యా ప్రధాన పాత్రగా చేసిన ‘సూరారై పోట్రూ’ రెండవ స్థానంలో నిల్చింది. ఈ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహించారు. సూర్యా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని సినిమాను పూర్తి చేశాడు. కానీ ఈ సినిమా సూర్య అంచనాలను తారు మారు చేసింది. ఎవ్వరు ఊహించనంతగా హిట్ అయింది.  అయితే మూడవ స్తానంలో తన్హాజీ, నాలుగో స్థానంలో శకుంతలా దేవీ, ఐదో ప్లేసులో శ్రీదేవీ నటించిన గుంజన్ సక్సేనా ఉంది.

Related posts