telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మూడో టెస్టు : .. భారత్ డిక్లేర్ … రెండు వికెట్లు కోల్పయిన దక్షిణాఫ్రికా..

south africa lost 2 wickets after india declared

మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఆట ముగిసింది. ఈరోజు ఓవర్‌నైట్ స్కోరు 224/3తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టులో.. ఓపెనర్ రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28×4, 6×6) డబుల్ సెంచరీ బాదగా, వైస్ కెప్టెన్ అజింక్య రహానె (115 బంతుల్లో 192 బంతుల్లో 17×4, 1×6) శతకం సాధించాడు. దీంతో.. టీ విరామానికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ని విరాట్ కోహ్లీ 497/9 వద్ద డిక్లేర్ చేశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఈరోజు వెలుతురులేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 9/2తో నిలిచింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా భారత్ కంటే 488 పరుగులు వెనకబడి ఉండగా.. క్రీజులో కెప్టెన్ డుప్లెసిస్ (1), హజ్మా (0) ఉన్నారు.

ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ (0)ని పేసర్ మహ్మద్ షమీ ఔట్ చేయగా.. రెండో ఓవర్‌లో ఆఖరి బంతికి మరో ఓపెనర్ డికాక్ (4)ని ఉమేశ్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇద్దరూ బౌన్సర్ బంతుల్ని ఆడే ప్రయత్నంలో వికెట్ కీపర్ సాహాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. నేటితో రెండు రోజులు ఆట ముగియగా.. శనివారం తొలి సెషన్ మినహా.. మొత్తం భారత్‌ జట్టే ఆధిపత్యం చెలాయించింది. ఈరోజు తొలి సెషన్‌లోనే రహానె శతకం సాధించగా.. రెండో సెషన్‌లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఆఖరి సెషన్‌లో ఆట కొద్దిసేపు మాత్రమే జరగగా.. ఆ కొద్ది సమయంలోనే వరుసగా రెండు వికెట్లు పడగొట్టి భారత బౌలర్లు సఫారీలను ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమయ్యారు.

Related posts