telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

స్మార్ట్ గా జవాబిచ్చిన .. దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్‌ మహారాజ్‌ ..

south africa bowler smart answer on match

భారత ఓపెనర్లు రోహిత్‌శర్మ(176), మయాంక్‌ అగర్వాల్‌(215) అద్భుతంగా బ్యాటింగ్‌ చేయడం వల్లే మ్యాచ్‌ తమకు దూరమైందని దక్షిణాఫ్రికా బౌలర్‌ కేశవ్‌ మహారాజ్‌ పేర్కొన్నాడు. కేశవ్‌ 55 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు తీయగా, అవతలి నుంచి అతడికి సహకారం లభించలేదు. డేన్‌ పీట్‌, ముతుస్వామి చెరో వికెట్‌ తీసినా ప్రభావం చూపలేకపోయారు. రెండో రోజు మ్యాచ్‌ ఆనంతరం కేశవ్‌ మాట్లాడుతూ.. బ్యాట్స్‌మన్‌ ముందుకొచ్చి షాట్లు ఆడినంత మాత్రాన తమ బౌలర్లు చెత్త బంతులేసినట్లు కాదని, బ్యాట్స్‌మన్‌ క్రీజులో ఉండి ఆడినా, నిలదొక్కుకొని కట్‌షాట్లు ఆడినా అది వేరే విషయమని వివరించాడు.

తమ బౌలర్‌ డేన్‌కు ఈ మ్యాచ్ కలిసిరాలేదని చెప్పిన కేశవ్‌.. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌, రోహిత్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారని మెచ్చుకున్నాడు. అలాగే మ్యాచ్‌లో టాస్‌ కీలకమని, స్పిన్‌ బౌలింగ్ చేయాలంటే అందుకు తగ్గ పరిస్థితులు అవసరమని చెప్పాడు. సరైన సమయంలో మంచి బంతులేసుంటే తమ జట్టు ఇంకాస్త మంచి స్థితిలో ఉండేదని కేశవ్‌ చెప్పుకొచ్చాడు. పరిస్థితులు ఇంకా చేయి దాటిపోలేదని, బ్యాటింగ్‌ బాగా చేస్తే తమ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందని అన్నాడు. పిచ్‌ స్వభావం మారడం భారత బౌలర్లకు కలిసి వస్తోందని తెలిపాడు.

Related posts