telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా ఇంటిపేరు చాలా ఉపయోగపడింది… నెపోటిజంపై శృతిహాసన్ రియాక్షన్

Shruthi

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సుశాంత్ మరణానికి నెపోటిజం కారణమంటూ స్టార్ వారసులపై నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో పలువురు సెలెబ్రిటీలు నెపోటిజం వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులపై నోరు మెదుపుతున్నారు. అయితే స్టార్ వారసులకు తప్ప బయటివారికి అవకాశాలు రావడం లేదని కంగనా రనౌత్ వంటి కొందరు విమర్శలు చేస్తున్నారు. నెపోటిజం గురించి కమల్ హాసన్ నట వారసురాలు శృతి తాజాగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ “నాకు సినీ రంగప్రవేశం చాలా సులభంగా జరిగిపోయింది. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణ ప్రభావం అది. నా ఇంటిపేరు చాలా ఉపయోగపడింది. నా తల్లిదండ్రుల వల్లే నేను సులభంగా సినీ రంగంలోకి ప్రవేశించగలిగాను. నేను దానిని ఖండించలేను. అయితే సినీ రంగంలోకి ప్రవేశించాక మాత్రం నా ప్రయాణం సాఫీగా సాగలేదు. అది అందరికీ తెలుసు. ఎన్నో పరాజయాలను ఎదుర్కొన్నాను. ఎంతో కాలం తర్వాతే నాకు విజయం వచ్చింది. నాకు అర్థమైందేంటంటే.. వారసత్వం వల్ల ఎంట్రీ సులభమవుతుంది. నిలదొక్కుకోవడం కష్టం అవుతుంది” అని శృతి చెప్పుకొచ్చింది.

Related posts