telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి బాగోలేదు: గంగూలీ

ganguly on icc world cup finals

బీసీసీఐ అధ్య‌క్షుడిగా సౌర‌వ్ గంగూలీ నియామ‌కం దాదాపు ఖ‌రారైంది. బ్రిజేశ్ ప‌టేల్‌ను వెన‌క్కి నెట్టేస్తూ అధ్య‌క్ష రేసులో గంగూలీ టాప్‌లో నిలిచిన‌ట్లు స‌మాచారం. 47 ఏళ్ల గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో గంగూలీ మాట్లాడుతూ, బీసీసీఐ అధ్యక్షుడు కావడమనేది ఒక గొప్ప అనుభూతి అని చెప్పారు.

భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించిన తనకు ఇది ఒక గొప్ప అనుభూతి అని అన్నారు. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి బాగోలేదని చెప్పారు. బీసీసీఐ ఇమేజ్ ను మళ్లీ పెంచడానికి ఇది తనకొక గొప్ప అవకాశమని తెలిపారు. డొమెస్టిక్ క్రికెట్ ను బలోపేతం చేసే క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడమే తన ప్రథమ కర్తవ్యమని గంగూలీ పేర్కొన్నారు.

Related posts