ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

హాయిగా నిద్ర పట్టడానికి సరైన పద్ధతి ఇదే

రోజుకు 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలని, ఒకవేళ కుదరకపోతే కనీసం 6 గంటలైనా నిద్ర తప్పనిసరని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు ఎక్కువ సమయం నిద్రపోయినా కూడా నిద్ర సరిపోలేదని అన్పిస్తుంది. ఆరోజంతా మగతగా, అలసటగా ఉంటుంది. అయితే డిన్నర్లు, పార్టీలు, సినిమాలు ఇలాంటివి కూడా నిద్ర సమస్యలకు కారణం కావచ్చు. అయితే ఇది ఒక్కరోజు సమస్య మాత్రమే కాదు. ఈ సమస్య మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మెల్లగా తలనొప్పి కూడా వస్తుంది. అందుకే సరైన సమయంలోసరైన నిద్ర అందరికీ అవసరం. 2017లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం నిద్రకు ఉపక్రమించే తీరు కూడా నిద్రాభంగానికి కారణం కావచ్చని పేర్కొంది.

నిద్రకు ఉపక్రమించడానికి సరైన పద్ధతి ఏదో తెలుసుకుందాం.

* కొంతమంది బోర్లా పడుకుంటారు. వీరికి ఈ పద్ధతే సౌకర్యంగా అన్పిస్తుంటుంది. కానీ బోర్లా పడుకోవడం వలన శరీర భాగాలు ఒత్తిడికి గురవుతాయి. దీనివలన కండరాల నొప్పులు, తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉండడం వలన ప్రశాంతంగా నిద్ర పట్టదు.

* కొంతమంది ఎడమవైపు గానీ, కుడి వైపు గానీ తిరిగి పడుకుంటారు. దీనివలన భుజాలు, తొంటి భాగం అసౌకర్యానికి గురవుతాయి. ఎక్కువ సేపు ఒకేవైపు తిరిగి పడుకుంటే భుజాలు నొప్పి కలగడంతో సరిగ్గా నిద్ర పట్టదు. కాబట్టి ఈ పద్ధతిలో కూడా నిద్రకుపక్రమించకపోవడం మంచిది.

* ఇంకా కొంతమంది వెల్లకిలా పడుకుంటారు. ఇది నిద్రకుపక్రమించడానికి చాలామంచి పద్ధతి. ఎందుకంటే దీనివలన శరీర భాగాలు ఏవీ అసౌకర్యానికి గురికావు. కండరాలు నొప్పి కూడా ఉండదు. దీనివల్ల హాయిగా నిద్ర పడుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండగలం. అందరూ ఈ పద్ధతిని అలవాటు చేసుకోవడం చాలా మంచిది.

* ఇంకా నిద్రకు ఉపక్రమించేముందు తీసుకునే ఆహరం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రాత్రి పూట తేలికైన, మితాహారం తీసుకోవడం మంచిది.

Related posts

ఎండాకాలంలో చర్మాన్ని సంరక్షించండిలా…

admin

గాయత్రీ మంత్రం జపిస్తున్నారా ?

admin

వాకింగ్ ఆరోగ్యకరమేనా ?

admin

Leave a Comment