telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకాశం నీ హద్దురా : ‘కాటుక కనులే’ సాంగ్ ప్రోమో

Akasham-ni-Haddura

తమిళ హీరో సూర్య ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో వెంకటేష్‌తో ‘గురు’ సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర ఇప్పుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళంలో ‘సూరరై పోట్రు’ టైటి‌ల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ అనే టైటిల్‌తో విడుదల చేస్తు్న్నారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్యా ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లపై సూర్య, రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర‌పాండ్యన్‌, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌లెక్షన్ కింగ్ డాక్టర్ ఎం. మోహ‌న్‌బాబు ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్ తదితరులు నటిస్టున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఈరోజు (జూలై 23న) సూర్య పుట్టినరోజును పురష్కరించుకుని ఈ సినిమాలోని ‘కాటుక కనులే’ అనే పాట వీడియో ప్రోమోను విడుదల చేశారు. ‘‘కాటుక క‌నులే మెరిసీపోయే పిల‌డా నిను చూసీ’’ అంటూ సాగే ఈ పాట‌లో సూర్య, హీరోయిన్ అప‌ర్ణా బాల‌ముర‌ళి మ‌ధ్య రొమాంటిక్ కెమెస్ట్రీ అల‌రిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ స‌మ‌కూర్చిన ఆహ్లాద‌క‌ర‌మైన బాణీకి భాస్కర‌భ‌ట్ల త‌న క‌లంతో మ‌రోసారి సుమ‌ధుర‌మైన సాహిత్యాన్ని అందించారు. సింగ‌ర్ ధీ త‌న జీర గొంతుతో పాట‌కు ప్రాణం పోశారు.

Related posts