telugu navyamedia
telugu cinema news trending

ఆదిత్య పంచోలీతో కంగనా ఎఫైర్… స్పందించిన సూరజ్ పంచోలి

KAngana-Ranauth

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొన్నాళ్ల క్రితం చేసిన ఆరోపణలు బాలీవుడ్ లో తీవ్ర దుమారాన్ని రేపాయి. హృతిక్ రోషన్ తనను ప్రేమించి వాడుకుని వదిలేశాడని, సీనియర్ నటుడు ఆదిత్య పంచోలీ తనను కొట్టి హింసించాడని ఆరోపించారు కంగనా. కంగన సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆదిత్యతో చట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు సమాచారం. వీరిద్దరూ కలిసున్నప్పటి ఫొటోలు కూడా ఇప్పటికీ వికిపీడియాలో కనిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ఈ ఎఫైర్‌పై ఆదిత్య పంచోలీ కొడుకు సూరజ్ పంచోలీ స్పందించారు. “ఈ విషయం గురించి నేను ఏమీ మాట్లాడలేను. అది మా అమ్మానాన్నల సమస్య. వారు పరిష్కరించుకున్నారని అనుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం అమ్మమ్మ తాతయ్యలతోనే గడిపాను. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. మా అమ్మానాన్నల జీవితంలో జరిగిన కొన్ని విషయాలపై నేను సంతోషంగా లేను. మా అమ్మ మానసికంగా చాలా స్ట్రాంగ్” అని వెల్లడించారు. కంగన తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని ఆదిత్య కేసు పెట్టారు. ఆదిత్య భార్య జరీనా వాహబ్ ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘కంగనకు నా భర్తతో అక్రమ సంబంధం ఉంది. పెళ్లైన ఒక మగాడితో సంబంధం పెట్టుకుని ఆ తర్వాత అతనితో విడిపోయి ఇప్పుడు రేప్ చేశాడంటే ఎలా?’ అని షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పటికీ ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. ఆదిత్య తనపై కేసు వేయడంతో కంగన కూడా కేసు పెట్టారు. ఇప్పటికీ ఈ కేసుల కోర్టులో నానుతూనే ఉన్నాయి. పంచోలీ కుటుంబం మొత్తం దాదాపు ఆరేళ్లుగా వివాదంలో ఇరుక్కుంది. కంగన విషయంలో ఆదిత్య పేరు బయటికి వచ్చింది. బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో సూరజ్ పేరు బయటికి వచ్చింది. ఇప్పటికీ వీరిద్దరూ తమ కేసుల్లో భాగంగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

Related posts

ఈ దర్శకుడు నీరు ఖర్చవుతుందని కారు కొనలేదట…!?

vimala p

సాహో అప్డేట్ : భారీ రేటుకు ఓవర్సీస్ హక్కులు

vimala p

బాలీవుడ్ లో “ప్రస్థానం”… కలెక్షన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే…!!

vimala p