telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రైవేట్ పాఠశాలల పేరులోంచి “పబ్లిక్” మాయం కానుందా ?

Private-Schools

త్వరలో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ఆయా పాఠశాలల పేర్ల నుంచి “పబ్లిక్” అనే పదాన్ని తొలగించాల్సి ఉటుంది. దేశంలోని చాలా ప్రైవేటు పాఠశాలల పేర్లలో ‘పబ్లిక్’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు పాఠశాలల యాజమాన్యం. తాజాగా కే. కస్తూరిరన్గాన్ కమిటీ రూపొందించిన ముసాయిదా జాతీయ విద్యా విధానంలో కీలకమైన నిబంధన ప్రకారం “ప్రైవేటు పాఠశాలలు ఏ కమ్యూనికేషన్, పత్రాలు లేదా హోదాలలో “పబ్లిక్” అనే పదాన్ని ఉపయోగించకూడదు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ మార్పునునిబంధనను అన్ని ప్రైవేట్ పాఠశాలలు పాటించాల్సి ఉంటుంది. పబ్లిక్ పాఠశాలలు మాత్రం ఇందుకు మినహాయింపు. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఈ మార్పు అమలులోకి వస్తుంది. ఈ కమిటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖకు కూడా పేరు మార్చాలని సూచించడం గమనార్హం.

Related posts