telugu navyamedia
news political trending

బీహార్ ఫలితాలపై సోనూసూద్ కామెంట్..

Sonu-Sood

బీహార్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ కామెంట్ చేసాడు. బీహార్ ప్రజలు మంచి కోసం ఎదురుచూస్తున్నారని..ఈ దేశ ప్రజలు ప్రభుత్వాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీహార్ లో ఎన్డీయేకు మరోసారి అవకాశం ఇచ్చారని..మరోసారి కూడా అవకాశం ఇవ్వొచ్చని తెలిపాడు. తమ జీవితాలు ఇంకా మెరుగు అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశం ఇచ్చి ఉండొచ్చని పేర్కొన్నాడు. బీహార్ లో ఎవరు గెలిచిందన్నది ముఖ్యం కాదని..ఐదేళ్ల తర్వాత అక్కడి ప్రజల జీవన స్థితిగతులు మారాయా? లేదా అన్నది ముఖ్యం అని సోనూసూద్ పేర్కొన్నాడు. కాగా..ఎన్డీఏకే పట్టం కట్టారు బీహార్ ప్రజలు. మరోసారి సుశాసన్ బాబు నితీష్‌.. సీఎంగా ఎన్నిక కానున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌.. తన సత్తా చాటారు. చివరివరకూ ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చారు. ఎల్జేపీ పెద్దగా సీట్లు సాధించకున్నా.. గణనీయంగా ఓట్లు చీల్చింది. మొత్తం 243 స్థానాలకుజరిగిన ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ సాధించింది. 125 స్థానాలు గెల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాఘట్‌ బంధన్‌ 110 స్థానాలు సాధించింది.

Related posts

మళ్లీ ఇప్పుడా తప్పు చేయొద్దు: తుమ్మల

vimala p

క్లాస్ రూమ్ లో మొబైల్ ఫోన్స్ వాడితే కఠిన చర్యలు!

vimala p

టైగర్ ష్రాఫ్ న్యూ లుక్… సిక్స్ ప్యాక్ కాదు… ఏకంగా టెన్ ప్యాక్..!!

vimala p