telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫీజుల కోసం విద్యార్థుల హక్కును హరించవద్దు : సోనూసూద్

Sonu-Sood

కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సోనూసూద్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలకు ఓ విజ్ఞప్తి చేశాడు సోను. “పేద విద్యార్థులు ఫీజు డిపాజిట్ చేయనందుకు ఆన్‌లైన్ క్లాసులను నిలిపివేయకండి. ఫీజు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వండి. మీరు చేసే ఆ చిన్న సాయం ఎంతో మంది పిల్లల భవిష్యత్‌ను కాపాడుతుంది. వాళ్లను మంచి మనుషులుగా చేస్తుంది” అని సోనూ ట్వీట్ చేశాడు. ఇక మరో ట్వీట్ లో “విద్య కంటే గొప్ప విరాళం మరొకటి లేదు. ఫీజుల కోసం చదువుకునే విద్యార్థుల హక్కును హరించవద్దు” అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. దీనికి ముందు సోనూసూద్ ని ఒక అమ్మాయి సహాయం కోరింది. తాను చాలా పేదరాలునని, ఫీజు కూడా చెల్లించలేనని పరిస్థితి తనదని వెల్లడించింది. అయితే చదువుకోవాలనే కోరిక తనలో చాలా ఉందని, దానికి సహాయం కావాలని సోనూసూద్ ని సహయం కోరింది. ఈ క్రమంలో సోనూసూద్ ఈ పోస్ట్ చేశాడు.

Related posts