telugu navyamedia
క్రీడలు వార్తలు

సెలబ్రెటీలకు కూడా సహాయం చేస్తున్న సోను సూద్..

లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికులను ఆదుకుని హీరోగా అవతరించిన సోనూ సూద్‌.. విద్యార్థుల ఆన్‌లైన్‌ చదువులకు ఆటంకం రాకుండా అనేక చర్యలు తీసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మందికి సాయం చేసిన సోనూ సూద్.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్​ సురేశ్​ రైనాకు సాయం చేసి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆక్సిజన్​ సిలిండర్​ను పంపి తనలోని మానవత్వాన్ని చూపారు. ‘మీరట్‌లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాలి. ఆమె వయసు 65. తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో ఉన్నారు’ అని రైనా ట్వీట్‌ చేశాడు. మిస్టర్ ఐపీఎల్ ట్వీట్‌కు స్పందించిన సోనూ సూద్‌..’10 నిమిషాల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్‌ అక్కడికి చేరుకుంటుంది భాయ్‌’ అంటూ రిప్లై ఇచ్చారు. కర్ణాటకలోని సోనూ సూద్‌ బృందం మంగళవారం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 20-22 మంది ప్రాణాలను కాపాడింది. బెంగళూరులోని అరక్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని.. అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలంటూ సత్యనారాయణన్‌ అనే ఓ పోలీసు అధికారి కర్ణాటకలోని సోనూసూద్‌ బృందానికి అత్యవసర సందేశం పంపారు.

Related posts