telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐసీయూలో చికిత్స పొందుతున్న నటుడికి సోనూసూద్ సాయం

Sonusood

బాలీవుడ్ రియల్ హీరో సోనూసూద్ తాజాగా టీవీ నటుడు అనుపమ్ శ్యామ్‌కు అండగా నిలిచాడు సోనూ సూద్.గత కొన్నాళ్లుగా అనుపమ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన రెండు రోజుల క్రింత ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న అనుపమ్‌కి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని అతని సోదరుడు అనురాగ్ విజ్ఞప్తి చేశాడు. దీంతో అనుపమ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఓ నెటిజన్ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇంకేముంది తప్పక సాయం చేస్తానని సోనూ సూద్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. దీంతో సోనూసూద్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్‌. అనుపమ్ శ్యామ్ ప్రముఖ సీరియల్స్‌తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో సైతం నటించారు. ఇక అనుపమ్ ‌కు సాయం చేసేందుకు ప్రముఖ నటుడు మనోజ్ వాజ్ పేయి సైతం ముందుకొచ్చారు. ఆయన కూడా అనుపమ్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్యం ఆరా తీశారు.

Related posts