telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి పెద్దమనసు చాటుకున్న సోనూసూద్

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో మందికి సహాయం చేసి దేవుడు అయ్యాడు. ఆ కష్ట కాలంలో సోనూ సూద్ చేసిని సహాయం మరువలేనిది. ఎందరో వలస కార్మికులను ఇల్లకు చేర్చారు. విదేశాలలో చిక్కుపోయిన వారిని స్వదేశానికి రప్పించారు. ఇలా లాక్‌డౌన్ సమయంలో మొదలు పెట్టిన సహాయాన్ని సోనూసూర్ కొనసాగిస్తూనే ఉన్నారు. సహాయం కోరుతు తన వద్దకు చేరిన వారికి లేదనకుండా చేయూతనిస్తున్నారు. అయితే తాజాగా సోను సూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు. కోవిడ్ -19 కారణంగా భారతి అనే అమ్మాయి దాదాపు 85-90% ఊపిరితిత్తులను కోల్పోయింది, సోను ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు.

ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు, ఇది హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. ECMO అని పిలువబడే ఒక ప్రత్యేక చికిత్స ఉందని అతను తెలుసుకున్నాడు, దీనిలో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చు. ఈ ECMO చికిత్స కోసం మొత్తం సెటప్ హైదరాబాద్ నుండి 6 మంది వైద్యులతో ఒక రోజు ముందుగానే రావాలి. ఇందుకోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో భారతికి ఉత్తమమైన చికిత్సను పొందగలిగారు.

దీని గురించి సోను సూద్ మాట్లాడుతూ, “అవకాశాలు 20% మాత్రమే అని వైద్యులు. ఆమె 25 ఏళ్ల యువతి, అందుకే మేము ఈ అవకాశాన్ని తీసుకున్నాము, వెంటనే ఎయిర్ అబులెన్సు బుక్ చేసాము. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స బాగా జరుగుతోంది, ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుంది. ”కోవిడ్ -19 పండమిక్ లో ఒకరిని విమానంలో చికిత్సకు తీసుకురావడం ఇదే మొదటి సందర్భం. భారతి తండ్రి రిటైర్డ్ రైల్వే అధికారి. సోను సూద్ కు కరోనా పాజిటివ్ అని ఇటీవల తేలింది. హోమ్ quarantineలో ఉంటూ ఇవన్నీ చేయడం అభినందనీయం. అందుకే ఆయన రియల్ హీరో.

Related posts