telugu navyamedia
రాజకీయ వార్తలు

పోలీసుల దాడిపై రాష్ట్రపతికి విపక్షాల ఫిర్యాదు

soniya gandhi

దేశంలో పలు ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. యూనివర్సిటీల విద్యార్థులు సైతం రోడ్లపైకి రావడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షనేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది.

సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు, పోలీసుల వైఖరిపై నేతలు రాష్ట్రపతికి వివరించారు. జామియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దాడిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సోనియా వెంట రాష్ట్రపతిని కలిసినవారిలో గులాంనబీ ఆజాద్, సీతారాం ఏచూరి, డి.రాజా, డెరెక్ ఓబ్రెయిన్, రాంగోపాల్ యాదవ్ తదితరులున్నారు.

Related posts