telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రాహుల్ గాంధీ … రాజీనామా .. ఆమోదించిన సోనియా…

rahul supposed to resign as chief of congress

కాంగ్రెస్‌ పార్టీలో లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ససేమిరా అనడంతో, రాహుల్ నిర్ణయానికి సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ అంగీకరించినట్టు తెలుస్తోంది. తాను మళ్లీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టబోనని, మరొకరిని ఎంపిక చేయాలని రాహుల్ గట్టి పట్టుమీద ఉండటం, అధిష్టానం దూతలు అహ్మద్‌పటేల్, కేసీ వేణుగోపాల్‌ లతో పాటు సోనియా గాంధీ సైతం రాహుల్ ను వారించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కాంగ్రెస్ తరఫున లోక్ సభకు ఎన్నికైన కొత్త ఎంపీలను కలుసుకుని మాట్లాడేందుకు సైతం రాహుల్ నిరాసక్తత కనబరిచినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, పార్టీ కోసం పనిచేస్తానని తన వద్దకు వచ్చిన సీనియర్ నేతలకు రాహుల్ స్పష్టం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్‌ చీఫ్‌ గా రాహుల్ తప్పుకున్న పక్షంలో తాను తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానని సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం హెచ్చరించినట్టు తెలుస్తోంది. రాహుల్ విషయంలో వదంతులను ప్రచురించవద్దని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌ దీప్‌ సూర్జేవాలా మీడియాకు సూచించారు.

Related posts