telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తండ్రి ముందు అలాంటి బట్టలేంటి… హీరోయిన్ పై నెటిజన్లు ఫైర్

Sonam-Kapoor

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వేసుకునే దుస్తులకు ఆమెకున్న స్టైల్ సెన్స్‌కు ఏకంగా బాలీవుడ్ ఫిదా అయిపోయింది. ఆమెను స్టైల్ ఐకాన్‌గా అభివర్ణిస్తారు. ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే సోనమ్ ఎలాంటి దుస్తులు వేసుకున్నా అందంగానే ఉంటారు. ఏ డ్రెస్‌కి ఏది సూట్ అవుతుందో కూడా బాగా తెలుసు. కొన్ని సందర్భాల్లో ఆమె వేసుకునే బట్టలను వేసుకోవడానికి మిగతా హీరోయిన్లు భయపడుతుంటారు. అయితే తాజాగా సోనమ్ కపూర్‌ వేసుకున్న దుస్తులపై నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి అనిల్ కపూర్ పక్కన ఉన్నప్పుడు కూడా ఒళ్లంతా కనిపించేలా అసభ్యకరమైన దుస్తులు వేసుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. సోనమ్ కపూర్ తండ్రి నటించిన ‘మలంగ్’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లారు. ముందు భాగం అంతా కనిపించేలా నలుపు రంగు గౌను వేసుకున్నారు. ఆ దుస్తుల్లోనే తండ్రి పక్కన నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు కాస్తా వైరల్ అవడంతో నెటిజన్లు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం తండ్రి పక్కన ఉన్నప్పుడైనా కాస్త పద్ధతిగా ఉండు అంటూ సోనమ్‌కు క్లాస్ పీకుతున్నారు. ఇలాంటి కామెంట్స్ పెడుతున్నవారిలో అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం.

Related posts