telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెల్ఫ్ క్వారంటైన్‌లో సోనమ్ కపూర్…

sonamkapoor

లండన్ నుంచి ఇండియాకు తిరిగివచ్చిన తరవాత కరోనా వైరస్ భద్రతా చర్యలపై తన అనుభవాన్ని సోనమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తన వంతు బాధ్యతగా సోనమ్ కపూర్ తనను తాను గదిలో నిర్బంధించుకున్నారు. 14 రోజులపాటు సోనమ్ కపూర్, ఆనంద్ అహుజ ఒక గదిలో ఉండనున్నారు. అయితే, సోనమ్ భర్త ఆనంద్ తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో సోనమ్ తన అత్తమ్మ ప్రియా అహుజాతో మాట్లాడుతున్నారు. సోనమ్ పై అంతస్తులో ఉన్న తన గదిలో కిటికీ వద్ద నిలబడి కింద ఉన్న అత్త ప్రియాతో మాట్లాడుతున్నారు. అంటే, సోనమ్ అస్సలు రిస్క్ చేయదలుచుకోలేదు. అందుకే తనవాళ్లను కూడా ఈ 14 రోజులు కలవకూడదని నిర్ణయించుకున్నారు. లండన్ నుంచి వచ్చారు కాబట్టి సామాజిక బాధ్యత వహిస్తూ సోనమ్, ఆనంద్ ఎవరితో కలవకుండా 14 రోజుల పాటు ఒక గదిలో ఉండనున్నారు. అయితే, సోనమ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related posts