telugu navyamedia
సినిమా వార్తలు

నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు : సోనమ్ కపూర్

sonam

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ తనకు సంబందించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “పింక్” అనే షో బాలీవడ్ బుల్లితెరపై ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షోలో పాల్గొన్న సోనమ్ కపూర్ గతంలో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి ప్రస్తావించారు. ఒకప్పుడు తాను పొడుగ్గా,నల్లగా ఉండడంతో చాలా మంది నిన్నెవరు పెళ్లి చేసుకుంటారని ఎగతాళి చేసేవారని, కానీ అలా కామెంట్ చేసేవారి గురించి తాను పట్టించుకునేదాన్ని కాదని తెలిపింది సోనమ్. తానను ద్వేషించే వారినే శ్రేయోభిలాషులుగా భావించి, ఆ మాటలనే ఛాలెంజ్ గా తీసుకొని, ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టానని, ఆ తరువాత నచ్చిన సినిమాలో నటించడమే కాకుండా ప్రేమించిన వ్యకిని సొంతం చేసుకున్నానని చెప్పుకొచ్చింది సోనమ్. జీవితంలో ఇంతకన్నా నిరూపించుకోవాల్సింది ఏముంటుంది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ “జోయా ఫ్యాక్టర్” అనే సినిమాలో నటిస్తోంది. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 14న విడుదలకు సిద్ధం అవుతుంది.

Related posts