telugu navyamedia
telugu cinema news

సల్మాన్ “పేపర్ టైగర్”… సింగర్ సంచలన వ్యాఖ్యలు

Salman-KHan

బాలీవుడ్ సింగర్ సోనా మహాపాత్ర గతంలో సల్మాన్ పై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. “భారత్” సినిమా నుండి ప్రియాంకా తప్పుకుందని సల్మాన్ ఆమెపై సెటైర్లు వేయడంతో సోనా సోషల్ మీడియా వేదికగా సల్మాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అతడి అభిమానుల నుండి బెదిరింపులు వచ్చినా, వెనక్కి తగ్గలేదు. తాజాగా మరోసారి సల్మాన్ పై మండిపడింది. ఇప్పుడు మరోసారి సల్మాన్ తాజా చిత్రం “భారత్” సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.

“సల్మాన్ ఖాన్ నటించిన “భారత్” సినిమాకు హైప్, భారీ ప్రమోషన్ కల్పించినా, కనీసం ఒక వారం పాటు కూడా వసూళ్లు తీసుకురాలేకపోయిందని, ఇలాంటి ఫిలిం స్టార్లను ఏమని పిలవాలని..?” అడిగింది. అంతేకాదు.. అతడిని ‘పేపర్ టైగర్’ అని అభివర్ణిస్తూ.. ఇటువంటి వారిని పూజించడం మానుకోవాలని సలహా ఇచ్చింది. ఇది చూసిన సల్మాన్ అభిమానులు పబ్లిసిటీ కోసం సల్మాన్ పై విమర్శలు చేస్తుందని మంది పడుతున్నారు.

Related posts

మరో క్రేజీ చాన్స్ లో .. నభా నటేష్..

vimala p

సినిమా కోసం .. రోజు 20 సిగరెట్లు తాగాను.. : అర్జున్ రెడ్డి

vimala p

సైరా పూర్తి కాదా… మరో సారి బ్రేక్.. నటుడి మృతి..

vimala p