telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీటీడీ ఫోర్న్ వీడియోలపై సోము వీర్రాజు సీరియస్‌…

Somu-Veerraju bjp

తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీబిసిలో పార్న్ సైట్ లింక్ కలకలం రేపిన విషయం తెలిసిందే. శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఎస్వీబిసికి ఒక భక్తుడు మెయిల్ చేశాడు. అయితే తిరిగి భక్తుడికి పార్న్ సైట్ విడియో పంపాడు ఒక యస్వీబిసి ఉద్యోగి. దీంతో భక్తుడు టీటీడీ ఈవో సహా చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై తీవ్రంగా స్పందించిన ఈవో జవహర్ రెడ్డి టీటీడీ విజిలెన్స్ కి సమాచారం అందించారు. దీంతో ఎస్వీబిసి కార్యలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడిపి అధికారులు తనిఖిలు నిర్వహించారు. పార్న్ సైట్ విడియో పంపిన ఉద్యోగితో పాటు కార్యలయంలో పార్న్ సైట్లు చూస్తూన్న మరో 5 గురు ఉద్యోగులను గుర్తించింది సైబర్ క్రైమ్ టీం. కార్యాలయంలో విధులు నిర్వహించకూండా ఇతర విడియోలు చూస్తూన్న మరో 25 మంది సిబ్బందిని గుర్తించింది సైబర్ క్రైమ్ టీం. అయితే.. ఈ ఘటనపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు సీరియస్‌ అయ్యారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం లో ఇవాళ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింహాచలం భూములను రాజధానికి వాడాలని చూస్తున్నారని..అలా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని సోము వీర్రాజు అన్నారు. టీటీడీ ధర్మరక్షణకు రూ.500 కోట్లు ఇవ్వాలని..టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ సరిగా లేదని ఫైర్‌ అయ్యారు. టీటీడీ ఛానల్‌లో ఫోర్న్‌ వీడియోలు చూడటం దారుణమన్నారు. ఎస్వీబీసీ ఉద్యోగులను తీసేయాలని డిమాండ్‌ చేశారు. ఆ ఛానల్‌ను ధర్మచార్యులకు అప్పగించాలని.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులో ధర్మచార్యులు సభ్యులుగా ఉంటారని స్పష్టం చేశారు.

Related posts