telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అలాంటి పోస్టులు నిషేధం.. ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం!

instagram replasing facebook soon

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలపై నిషేధం విధించింది. జాతి విద్వేష, వేర్పాటువాదానికి సంబంధించిన అంశాలను ఇకపై అనుమతిచ్చేది లేదని ఆ సంస్థ ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఇటీవల న్యూజిలాండ్ సంఘటన ద్వారా మేల్కొన్న ఫేస్‌బుక్ యాజమాన్యంలో పై అంశాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం వారం రోజుల్లో అమలులోకి వస్తుందని తెలిపారు.

కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్ మజీద్‌లపై శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 50 మంది మరణించారు. ఉన్మాది మజీద్‌లపై దాడులకు పాల్పడుతూ దానికి సంబంధించిన వీడియోను ప్రత్యక్షంగా ఫేస్‌బుక్‌లో ప్రసారం చేశాడు. దీంతో ఫేస్‌బుక్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టిన ఫేస్‌బుక్ యాజమాన్యం విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలపై కీలక నిర్ణయం తీసుకుంది.

Related posts