telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

డిసెంబర్ విడుదల కానున్న సోలో బ్రతుకే సో బెటర్…

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్.  చాలా ఫ్లాపుల తర్వాత సాయి తేజ్ ఇప్పుడిప్పుడే విజయాలను రుచి చూస్తున్నాడు. చిత్రలహరి , ప్రతి రోజు పండగే సినిమాలు హిట్ అవడంతో ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ఫై ఇప్పటికే పలు వార్తలువచ్చాయి. సినిమా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారని ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ రేటుకు సోలో బ్రతుకే సోబెటరు సినిమాను దక్కించుకుందని కథనాలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్ సినిమాను డిసెంబర్ లో థియేటర్ లో విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా సినిమాను డిసెంబర్ లోథియేటర్ లో విడుదల చేస్తున్నామని తెలిపారు .  నూతన దర్శకుడు సుబ్బు  దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమాలో నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందా… లేదా అనేది.

Related posts