telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఉచిత సోలార్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

solar pump set

సోలార్‌ శిక్షణలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సురభి ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ శేఖర్‌ మారంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కోసం హైదరాబాద్‌లోని బేగంపేటలోని సురభి ఎడ్యుకేషనల్‌ సొసైటీ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ సహకారంతో సూర్యమిత్ర శిక్షణ తరగతులలో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

90 రోజులపాటు సాగే ఈ కోర్సులో సోలార్‌ విద్యుత్‌కు చెందిన అన్ని అంశాలను నేర్పిస్తారన్నారు. ఐటీఐ (ఎలక్ట్రీషియన్‌, మెకానికల్‌), పాలిటెక్నిక్‌ (ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌), ఇంటర్మీడియట్‌ (ఒకేషనల్‌ ఎలక్ట్రికల్‌) చదివిన వారు అర్హులన్నారు. శిక్షణ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదని, వసతి సదుపాయంతోపాటు భోజన సదుపాయం ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు బేగంపేటలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్‌ క్యాంపస్‌ లో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9010191007, 9912387120 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

Related posts