telugu navyamedia
telugu cinema news trending

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

shobhan-babu

“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో రాణించాడు. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుని ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు. ఇక శోభన్ బాబుకు దేవుడంటే నమ్మకం లేదు. అలాగని దేవుడిని నమ్మేవారిని విమర్శించారు. ఆయన జీవితంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా గుడికి వెళ్లలేదని శోభన్ సన్నిహితులు అంటుంటారు. అయితే ఆయనకు ఘంటసాల భగవద్గీత వినడం చాలా ఇష్టం. వాకింగ్ చేస్తూ, రూములో ఏకాంతంగా కూర్చొని వింటుండేవారు. అంతేకాదు రోజుకో భగవద్గీత శ్లోకాన్ని చదివేవారు.

శోభన్ బాబు ఇష్టాయిష్టాల విషయానికొస్తే… ఆయనకు స్వీట్లంటే చాలా అంటే చాలా ఇష్టం. ఆయన స్వీట్ తినని రోజంటూ ఉండదేమో. నువ్వులతో చేసిన జీడీలు, బూందీ మిఠాయిలు శోభన్ బాబుకు ఇష్టం. ఇంకా తోటకూర పకోడీలు, పెసరట్టు అంటే ఇష్టం. నాన్ వెజ్ కూడా తింటారు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఆయన నాన్ వెజ్ తగ్గించేశారు. ఇక శోభన్ బాబు భోజనం చేసే కంచం ఎలా ఉంటుందంటే… బంగారు పూత ఉన్న పెద్ద వెండి కంచం… అందులోనే ఆయన రోజూ భోజనం చేసేవారు.

ఆయనకు బంగారం, దుస్తులపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆయన ఎడమచేతి ఉంగరం వేలికి మాత్రం పెద్ద పెద్ద డిమాండ్స్ ఉండే ఒకే ఒక్క ఉంగరాన్ని పెట్టుకునేవారు. అది కూడా మనవళ్ళు, మనవరాళ్లు ఇచ్చిన గిఫ్ట్. శోభన్ బాబు సాధారణంగా మెడలో బంగారు గొలుసు గానీ, ముంజేతికి బ్రాస్ లెట్ గానీ ధరించరు. కానీ రోజుకో ఖరీదైన వాచ్, రోజుకో వెరైటీ ఖరీదైన చెప్పులు వేసుకోవడం ఆయనకు చాలా ఇష్టం. ఇంకా కళ్లజోళ్లు, కార్లు, డ్రైవింగ్ అంటే మహా ఇష్టం. బ్రీఫ్ కేస్ లంటే కూడా చాలా ఇష్టం. వెరైటీ బ్రీఫ్ కేస్ లు కొంటుండేవారు. ఇక బిల్డింగులంటే శోభన్ బాబుకు ప్రాణం. ఎక్కడైనా మంచి మోడల్ బిల్డింగులు కన్పిస్తే… వెంటనే దాని గురించి ఆరా తీసి, ఆ మోడల్ ను సంపాదించి, వీలైతే అంతకన్నా మంచి మోడల్ బిల్డింగును కట్టే యోచన చేసేవారు.

చిన్న చిన్న కవితలు రాసి పక్కవారికి విన్పించడం ఆయనకు అలవాటు. శోభన్ కు తాత, బాబాయ్ ఇద్దరూ చాలా ఇష్టం. ఇంకా బంధువులు కూడా… రెండ్రోజులకు ఓసారైనా వారితో మాట్లాడుతూ ఉండేవారు. ఇంకా శోభన్ కు పల్లెటూరి విషయాలన్నా, వ్యవసాయానికి సంబంధించిన విషయాలన్నా ఇష్టమే. ఎవరైనా అభిమానులు ఆయనను కలవడానికి వస్తే… వారితో శోభన్ బాబు ముందుగా మాట్లాడేది వ్యవసాయం, వారి కుటుంబం లాంటి విషయాల గురించే. ఇంటీరియర్ డెకరేషన్ కు సంబంధించిన ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ పత్రికలంటే ఆయనకు మరీ ఇష్టం.

Related posts

50 రోజులు పూర్తి చేసుకున్న కార్తీ “ఖైదీ”

vimala p

చంద్రయాన్-2 : సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్… ఇట్స్ ఎ జర్నీ… మహేష్ ట్వీట్

vimala p

“దేదే ప్యార్ దే” రీమేక్… వెంకీ సరసన టబు

vimala p