Trending Today వార్తలు సినిమా వార్తలు

ఇది కాపీనే కావచ్చు కానీ ఆవేదనను అర్ధం చేసుకోండి… సుష్మితాసేన్.. సంచలనం

sushmitha-sen

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మీ టూ ఉద్యమం చెలరేగిపోతుంది… మీ టూ ఉద్యమానికి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి.. కాగా తాజాగా మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ అందాల తార.. తెలంగాణ వాసి సుస్మితాసేన్ దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన లోటస్ మేకప్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ…

‘మీటూ ఉద్యమం విదేశాల నుంచి కాపీ కొట్టిందే కావచ్చు’ కానీ మీటూ ద్వారా మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ తమ సమస్యలను దైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు… దీనిద్వారా వారందరికీ ఇది మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను.. మహిళలు తాము చెప్పుకునే సమస్యలను జాగ్రత్తగా వినాలి… వారికి నైతిక మద్దతు ఇవ్వాలి అంతేకాని అది తప్పా? ఒప్పా? అని ప్రశ్నించకూడదన్నారు… మహిళలను ప్రోత్సహించే పనులు చేపట్టాలి.. వారి ఆవేదనను అర్ధం చేసుకోవాలి అప్పుడే ఈ ఉద్యమానికి సార్థకత లభిస్తుంది అంటూ సుస్మితాసేన్ తెలిపారు..

Related posts

సాయి ధర్మ తేజ 'విజయ' రహస్యం…?

admin

నిరసన బాట పడుతున్న…బ్యాంకు ఉద్యోగులు…

chandra sekkhar

కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే పరిమితం చేస్తాం: ఎల్‌. రమణ

madhu

Leave a Comment