telugu navyamedia
రాజకీయ వార్తలు

సోషల్ మీడియా పోస్టులను తొలగించిన ఈసీ

social media

ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను తొలగించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు మొదలైనప్పటి నుంచి ఆదివారం చివరి విడత పోలింగ్ ముగిసే వరకు మొత్తం 909 పోస్టులను తొలగించినట్టు ఈసీ వెల్లడించింది. సామాజిక మాధ్యమాల నుంచి తొలగించిన 909 పోస్టుల్లో 650 ఫేస్‌బుక్ పోస్టులు ఉన్నట్టు తెలిపింది.

ఇందులో 482 పోస్టులు రాజకీయ పరమైనవని, 73 ఆయా పార్టీలకు చెందిన ప్రకటనలని, రెండూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించినవని తెలిపింది. పెయిడ్ న్యూస్‌కు సంబంధించి 647 కేసులు నమోదు చేసినట్టు పేర్కొంది. 220 ట్విట్టర్ పోస్టులు, 31 షేర్‌చాట్ పోస్టులు, వాట్సాప్‌లో మూడు, గూగుల్‌లో ఐదు పోస్టులను గుర్తించి తొలగించినట్టు తెలిపింది. గత ఎన్నికల్లో ఏకంగా 1,297 పోస్టులను తొలగించినట్టు ఈసీ పేర్కొంది. 647 పెయిడ్ న్యూస్ కేసుల్లో 57 ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల సందర్భంగా గుర్తించినట్టు ఈసీ పేర్కొంది.

Related posts