telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

స్మృతి ఇరానీ … ఇప్పుడు బి.ఏ. చదువుతుందట.. అది దూరవిద్య ద్వారా.. !

Minister Smruti Irani Ladies development

చాలా కాలం నుండి విద్యార్హత విషయంలో బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పలు విమర్శలకు గురిఅవుతున్నారు. తాజాగా కూడా ఆమె మరోమారు దొరికిపోయారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఒక్కోసారి ఒక్కోలా చెబుతుండడంతో ఆమె విద్యార్హతల్లో అసలు ఏదో, నకిలీ ఏదో అర్థం కావడం లేదు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో బీఏ పాసైనట్టు పేర్కొన్న స్మృతి 2014లో దూరవిద్య ద్వారా బీకాం ఫస్ట్ ఇయర్‌కు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. దీంతో 2004లో ఆమె చెప్పింది అబద్ధమని తేలింది. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ మంత్రిగా మానవ వనరుల శాఖను నిర్వహించారు.

గతంలో విలేకరుల సమావేశంలో స్మృతి మాట్లాడుతూ తాను యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నట్టు చెప్పారు. మరి ఆమె డిగ్రీ చదివితే ఎన్నికల అఫిడవిట్‌లో తాను డిగ్రీ పూర్తిచేసినట్టు ఎందుకు పేర్కొనలేదనే ప్రశ్న జనించింది. ఈ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తున్న ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన విద్యార్హతను బీకాం ఫస్టియర్‌గా పేర్కొన్నారు. దూరవిద్య ద్వారా బీకాం ఫస్టియర్‌కు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఎక్కడా యేల్ యూనివర్సిటీ డిగ్రీ గురించి ప్రస్తావించలేదు.

Related posts