telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

వందేళ్లు వయసు దాటాకే .. సిగరెట్ తాగాలట..

smoking is allowed after 100yrs only

పొగాకు అమ్మకాలలో కొన్ని నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఉత్పత్తులపై కూడా అనేక హెచ్చరికలు ఉంటూనే ఉంటాయి. కానీ సిగరెట్ తాగేందుకు మాత్రం వయసు నిబంధన లేదు, ఉత్పత్తులు మాత్రం కొన్ని చోట్ల 18ఏళ్లు, మరికొన్ని చోట్ల 21ఏళ్లు నిండిన వారికే అమ్ముతుంటారు. కానీ అమెరికాలోని ఓ రాష్ట్రంలో సిగరెట్‌ తాగాలంటే ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిందే. ఎందుకంటే అక్కడ 100ఏళ్లు దాటిన వారికి మాత్రమే సిగరెట్‌ అమ్మేలా చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. అమెరికాలోని హవాయి ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది.

2024 నాటికి రాష్ట్రంలో సిగరెట్‌పై పూర్తి నిషేధం తీసుకొచ్చేలా ఈ ప్రతిపాదనను తయారు చేశారు. ప్రస్తుతం అక్కడి చట్టాల ప్రకారం.. 21ఏళ్లు దాటిన వారికి మాత్రమే సిగరెట్‌ విక్రయించాలి. తాజా ప్రతిపాదనల ప్రకారం.. వచ్చే ఏడాది ఈ కనీస వయసును 30ఏళ్లకు పెంచుతారు. ఆ తర్వాత 2021లో 40ఏళ్లకు, 2022లో 50ఏళ్లకు, 2023లో 60ఏళ్లకు పెంచి.. 2024 నాటికి 100ఏళ్లు దాటిన వారికే సిగరెట్‌ విక్రయించేలా చట్టాన్ని తీసుకురావాలని హవాయి ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ బిల్లును స్థానిక డెమోక్రటిక్‌ రిప్రజెంటేటివ్‌ రిచర్డ్‌ క్రీగన్‌ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ బిల్లు చర్చల దశలో ఉంది. త్వరలోనే దీన్ని చట్టంగా మార్చాలని హవాయి ప్రభుత్వం భావించడం విశేషం. ఇదే తరహాలో ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా మద్యనిషేధాన్ని దఫాల వారీగా చేస్తామని అంటున్నారు.. ఇవన్నీ జరిగేవేనా.. వాళ్ళ పిచ్చి కాకపోతే. అలవాటు చేసేది వారే, నిషేధం అనేది వారే.. ఎంత విచిత్రమో!

Related posts