telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

యాషెస్‌ సిరీస్‌ : .. చెలరేగి ఆడి .. కెప్టెన్ స్థానాన్ని దక్కించుకోనున్న స్మిత్ ..

ashes test series smith century

కొంత కాలం విమర్శలు ఎదుర్కొన్న స్మిత్ మరో అవకాశం కోసం ఎదురుచూశాడు. యాషెస్‌ సిరీస్‌ తో అది దక్కడంతో పరుగుల వరద పారించి, స్టీవ్‌స్మిత్‌ తిరిగి ఆస్ట్రేలియా నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశానికి చేరువయ్యాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు సభ్యుడు మార్క్ టేలర్‌ అన్నాడు. టిమ్‌పైన్‌ టెస్టు సారథ్యానికి వీడ్కోలు పలికిన తర్వాత అతడికి అవకాశం దక్కుతుందని వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌పై టేలర్‌ నిషేధం విధించాడు. మరో ఏడాది వరకు ఎలాంటి నాయకత్వ బాధ్యతల్లో ఉండొద్దని ఆజ్ఞలు జారీ చేసిందీ అతడే కావడం గమనార్హం.

‘స్మిత్‌ ఆస్ట్రేలియాకు మళ్లీ సారథి అవుతాడని నా విశ్వాసం. క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డులో నేనూ ఒకడిని. అందుకే స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌కు శిక్ష ఖరారు చేశాను. కఠిన పాఠాలు నేర్చుకున్న స్మిత్‌ ఇక అత్యుత్తమ సారథి అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏప్రిల్‌ 1 తర్వాత అతడు నాయకత్వ బాధ్యతలు చేపడతాడా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు. అదంత వేగంగా జరగదు. టెస్టు సారథ్యానికి టిమ్‌పైన్‌ ముగింపు పలికాక అతడు జట్టును నడిపిస్తాడు. అయితే పైన్‌ ఆర్నెల్లు ఉంటాడా? రెండు మూడేళ్లు ఉంటాడా? అన్నది తెలియదు’ అని మార్క్‌ టేలర్ అన్నాడు. ఇయాన్‌ ఛాపెల్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Related posts