telugu navyamedia
సినిమా వార్తలు

ఐశ్వర్యపై మీమ్… వివేక్ కు షాకిచ్చిన ఆర్గనైజేషన్

Vivek-Oberai

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై వివాదాస్పద మీమ్ షేర్ చేసిన వివేక్ ఓబెరాయ్ చివరికి క్షమాపణలు చెప్పి, తన ట్వీట్ తొలగించారు. అయినప్పటికీ అతనిని కష్టాలు వెన్నాడుతున్నాయి. తాజాగా స్మయిల్ ఫౌండేషన్ ఛారిటీ ఆర్గనైజేషన్ వివేక్ ఓబెరాయ్‌ను తమ ఈవెంట్ షో నుంచి తప్పించింది. ఈ సందర్భంగా స్మయిల్ ఫౌండేషన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ దానిలో ‘వివేక్ ఓబెరాయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టును దృష్టిలో పెట్టుకుని స్మయిల్ ఫౌండేషన్ అతడిని సెలబ్రిటీల జాబితా నుంచి పక్కన పెట్టింది. మా సంస్థ మహిళా సాధికారతకు పాటు పడుతుంటుంది. వివేక్ ఓబెరాయ్ స్టేట్‌మెంట్ మా ఆలోచనా తీరుకు సరిపడదు” అని పేర్కొంది. కాగా వివేక్ ఎగ్జిట్ పోల్స్‌తో ఐశ్వర్య జీవితాన్ని ముడిపెడుతూ రూపొందించిన మీమ్‌ను షేర్‌ చేసిన విషయం విదితమే.

Related posts