telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఫలించని ఆర్బీఐ వ్యూహాలు.. తిరోగమనంలోనే ఆర్థిక వ్యవస్థ.. కుదేలవుతున్న చిన్న పరిశ్రమలు..

small scale industries drastically effected

దేశ ఆర్థిక పురోభివృద్ధి కోసం ఆర్బీఐ ఎన్ని వ్యూహాలు పన్నినా ఫలితం శూన్యంగానే కనిపిస్తుంది. పెద్ద పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించుకుని కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నాయి, ఇక చిన్న పరిశ్రమలైతే పూర్తిగా చితికిపోతున్నాయి. డిమాండ్‌ తగ్గడంతో పెద్ద పరిశ్రమల వారు ఉత్పత్తిని తగ్గిస్తుండడంతో ఆ ప్రభావం ఇప్పుడు చిన్న పరిశ్రమలపై ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో ఆయా సంస్థల వారు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితులు నెలకొంటు న్నాయి. ముఖ్యంగా ముద్రా రుణాలు తీసుకున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సూక్ష్మ తరహ పరిశ్రమల వారికి ఆర్థిక సాయం అందించేందుకుగాను కేంద్రంలోని మోడీ సర్కారు 2015లో ”’మైక్రో యూనిట్‌ డవలప్‌మెంట్‌ రిఫైనాన్సింగ్‌ ఏజెన్సీ”ను (ముద్రా) ప్రారంభించింది. ఈ పథకం కింద చిన్న యూనిట్లు కలిగిన వారికి తగిన ఆర్థిక సహకారం అందిస్తూ వారు వ్యాపార రీత్యా వృద్ధిలోకి వచ్చేందుకు గాను దాదాపు రూ.10 లక్షల వరకు వేగంగా రుణాలను అందించేలే తొలత ముద్రాను కేంద్ర సర్కారు అందుబాటు లోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్‌బిఎఫ్‌సి, ఆర్‌ఆర్‌బిలు, కార్పొరేట్‌ బ్యాంకులు ఇటీవలి కాలంలో విరివిగా ముద్రా రుణాలను జారీ చేశాయి.

గత కొన్నేళ్లుగా మోడీ సర్కారు తీసుకువస్తున్న నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి అనాలోచిత నిర్ణయాలకు తోడు ఆర్థిక వ్యవస్థలోని మందగమన పరిస్థితుల కారణంగా సూక్ష్మ యూనిట్ల వారు సరైన సమయనాకి నిర్వహణ మూలధనం లభించక యూనిట్లను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు డిమాండ్‌లో స్తబ్ధత కారణంగా ఈ పరిశ్రమలకు ఆర్డర్లు తగ్గిపోవడంతో చాలా యూనిట్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలొకి జారుకుంటున్నాయి. ఫలితంగా ఈ విభారగంలో ఇచ్చిన రుణాల ఒత్తిడి అంతకంతకు పెరిగిపోతూ వస్తోంది. తాజాగా ఇదే విషయమై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా వాణిజ్య బ్యాంకలకు పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. సర్కారు లెక్కల ప్రకారం ముద్రా రుణాలలో నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) విలువ మొత్తం దాదాపు రూ3.21 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపింది.

అంతకుముందు ఏడాది (2018లో) ఎన్‌పిఎలు మొత్తం 2.52 శాతంగా ఉండగా.. ఇది 2019లో 2.68 శాతానికి చేరుకున్నట్టుగా సర్కారు వెల్లడించింది. ఈ పథకం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు దాదాపు 19 కోట్ల ముద్రా రుణాలను బ్యాంకులు, ఇతర విత్త సంస్థలు జారీ చేశాయి. ఇందులో దాదాపు 3.63 కోట్ల మేర రుణాలు డీఫాల్టుగా నిలిచాయని సర్కారు లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రకారం చిన్నయూనిట్లు ఎంత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయో ఊహించవచ్చు. కార్పొరేట్‌ సంస్థలు వేలాది కోట్ల మేర రుణాలను ఎగవేస్తూ వస్తున్నా బ్యాంకులను హెచ్చరించని ఆర్‌బిఐ ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయిన చిన్న సంస్థల చెల్లింపుల విషయంలో బ్యాంకులను అప్రమత్తం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముద్రా రుణాల వల్ల చాలా మేలు జరిగిందని చాలా మంది ఆర్థికంగా నిలదొక్కుకొని బయటకు రాగలిగారని స్వయంగా చెబుతున్న ఆర్‌బిఐ ఇప్పుడు దీనికి భిన్నంగా బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

Related posts