telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

రద్దీ రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ లాండింగ్

రద్దీగా ఉన్న రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ లాండింగ్ అయిన ఈ ఘటన గురువారం వాషింగ్టన్‌లో చోటుచేసుకుంది. నాలుగు లేన్ల బిజీ రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్లింట్ థాంప్సన్ అనే పోలీస్ అధికారి సహాకరించారు. థాంప్సన్ ఎమర్జెన్సీ లైట్లు, ట్రాఫిక్ క్లీయరెన్స్ వల్ల విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. సింగిల్ ఇంజిన్ గల ఆ విమానంలో తలెత్తిన టెక్నికల్ సమస్య వల్ల అత్యవసర ల్యాండింగ్ తప్పలేదని పైలట్ డేవిడ్ అక్లామ్ మీడియాతో చెప్పాడు. విమానం రోడ్డుపై ల్యాండ్ అయినా… ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యేందుకు సహాకరించిన క్లింట్ థాంప్సన్‌ను పోలీస్ అధికారులు ప్రశంసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Related posts