telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ విద్యా వార్తలు

సాఫ్ట్ వేర్, సివిల్, మెకానికల్ వారికీ.. ఉచిత శిక్షణ..

skill development progaram in vijayawada

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఆయా ప్రాంతాలలో వారికి వివిధ సంస్థలు ముందుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌, సివిల్‌, మెకానికల్‌ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రైలాజిక్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ఎండీ సిరిమల్ల రవికుమార్‌ తెలిపారు. విజయవాడతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులన్నారు.

18 నుంచి 30 ఏళ్ల వయస్సున్న అభ్యర్థులు ఈ నెల 7న సంప్రదించాలన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశం కూడా కల్పిస్తామన్నారు. డిగ్రీ, బీటెక్‌, పీజీడీ, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులని, అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 8712030303, 7382053804, 8333973831 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

Related posts